అక్షరటుడే, బాల్కొండ: ఎస్సారెస్సీ నుంచి ఎంఎండీ వరకు గల ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టు ఎస్‌ఈకి సూచించారు. మంగళవారం ఉప్లూర్ ఎస్సారెస్పీ వరద కాలువను పరిశీలించారు. కాలువ ద్వారా నీరు దిగువకు వెళ్తుండడంతో వెంటనే ఎస్‌ఈకి ఫోన్ చేశారు. వరద కాలువ ద్వారా కేటాయింపుల కన్నా ఎక్కువ నీటిని దిగువకు వదలవద్దని సూచించారు. దీనివల్ల ఆయకట్టు రైతులకు నష్టం జరుగుతుందని వివరించారు. పంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే తన దృష్టికి తీసుకువాలన్నారు. తాను ప్రభుత్వంతో మాట్లాడతానని, లేకపోతే రైతుల పక్షాన పోరాడతానని పేర్కొన్నారు. అలాగే నాగపూర్ వద్ద గేట్ల నుంచి వరద కాలువ ద్వారా నీరు దిగువకు వెళ్తుండడంతో వెంటనే నిలిపివేయాలని ఎస్‌ఈని కోరారు.