అక్షరటుడే, ఇందూరు: నగరంలోని స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ పారాలీగల్‌ వలంటీర్లు సొసైటీ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.