అక్షరటుడే, జుక్కల్: సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక ఆదివారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్నూర్ మండలానికి చెందిన స్వరూప(34) భర్త మృతి చెందగా తన ఇద్దరు పిల్లలతో ఉంటోంది. మహమ్మద్ నగర్‌కు చెందిన కుమ్మరి అరవింద్‌తో పరిచయం కాగా అతడితోనే సహజీవనం చేస్తోంది. అయితే కొన్నాళ్లుగా మహిళకు అరవింద్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండురోజుల క్రితం ఆమెను అరవింద్ బెల్ట్‌తో కొట్టడంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఆమె మృతి వార్త తెలుసుకున్న అరవింద్ పరారయ్యాడు. అనాథలైన ఇద్దరు కుమారులకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిజాంసాగర్ ఎస్సై సుధాకర్, బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్, బాన్సువాడ టౌన్ సీఐ అశోక్ తదితరులు బందోబస్తు నిర్వహించారు.