అక్షరటుడే, వెబ్ డెస్క్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను కొట్టివేసింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్ళీ కేబినెట్ లో ప్రతిపాదించిన తర్వాతే గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రిమండలి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని సూచించిన హైకోర్టు తిరిగి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి చట్టప్రకారం ఎమ్మెల్సీలను నియమించుకోవచ్చని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను ఎమ్మెల్సీగా నియమిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గవర్నర్ వద్ద ఆమోదం లభించలేదు. ఇంతలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీలుగా నియమించింది. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. కానీ, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని దాసోజు శ్రవణ్ హైకోర్టు తలుపుతట్టారు. కాగా.. గురువారం హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి తిరిగి వీరిద్దరి నియామకానికి ఆమోదం తెలిపి గవర్నర్ ఆమోదానికి దస్త్రం పంపనున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు
Advertisement
Advertisement