మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మాణం, త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తింపు, పాఠశాలల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రానున్న రెండ్రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు జమ చేస్తామని మంత్రులు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.