అక్షరటుడే, వెబ్ డెస్క్: రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నేడు సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ కానుంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల యోచనలో ఉన్నారు.