అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హాష్‌ మనీ కేసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌ నేరాన్ని కోర్టు నిర్ధారించింది. అయితే జైలు శిక్ష, జరిమానా నుంచి మినహాయింపు ఇచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలికి లంచం ఇచ్చిన కేసులో ట్రంప్‌ నేరం నిరూపితమైంది. కాగా, అమెరికా చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు.