అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: విద్యుత్‌ శాఖలో పద్దెనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆర్టిజన్లను రెగ్యులర్‌ పోస్టుల్లోకి కన్వర్షన్‌ చేయాలని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్లను రెగ్యులర్‌ చేయాలని 2018లో హైకోర్టు తీర్పు ఇచ్చినా.. విద్యుత్‌ సంస్థ స్టాండింగ్‌ రూల్స్‌ పేరిట అమలు చేయడం లేదన్నారు. కార్మిక చట్టం ప్రకారం శ్రమదోపిడీకి గురవుతున్నామని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.