అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శతచండీ యాగ మహోత్సవం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండోరోజు మంగళవారం గ్రామంలోని దంపతులతో ఆలయంలో చండీహోమం, అవహిత పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణ, రాజేశ్వర్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.