అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రజాగాయకుడు, దివంగత గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్లు చేసిన వారికి అవార్డులు రాకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. పద్మ అవార్డులు వచ్చే అర్హత ఉన్న వారి పేర్లను పంపితే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. ఎవరి పేర్లు పెడితే వారికి అవార్డులు ఇవ్వమన్నారు. ఎందరో బీజేపీ కార్యకర్తలను చంపిన వారికి అనుకూలంగా గద్దర్ పాటలు పాడారన్నారు. అలాంటి వ్యక్తికి అవార్డు ఎలా ఇస్తామన్నారు.