అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో మరోసారి వడగళ్ల కురిసింది. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి రాళ్ల వర్షం పడింది. పలుచోట్ల వరి కోతలు కొనసాగుతుండగా.. రోడ్లపై ధాన్యం కుప్పలు ఆరబెట్టారు. అకాల వర్షంతో పలుచోట్ల చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నిల్వలు సైతం తడిశాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతన్నలు రాళ్ల వానను లెక్కచేయకుండా టార్పలిన్లు కప్పే ప్రయత్నం చేశారు. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాల కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.