అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి అని అన్నారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని పేర్కొన్నారు. ‘భారత్‌కు మేం ఎందుకు 21 మిలియన్ల డాలర్లు ఇవ్వాలి?’ అని ప్రశ్నించారు. కొసమెరుపుగా ‘నాకు ప్రధాని మోదీపై చాలా గౌరవం ఉంది’ అని చెప్పుకొచ్చారు.