అక్షరటుడే, ఇందూరు: వేల్పూర్ మండలం జాన్కంపేట – పచ్చల నడ్కుడ మధ్య గల వాగు సరిహద్దు సమస్యను పరిష్కరించాలని జాన్కంపేట వాసులు ఆందోళనకు దిగారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారుల ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాగు సరిహద్దు విషయంలో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయమై తహశీల్దార్‌తో పాటు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కు విన్నవించినా పట్టించుకోలేదని వివరించారు. ఇప్పటికైనా వాగు సరిహద్దును నిర్ణయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.