అక్షరటుడే, బాన్సువాడ: రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన బాన్సువాడ పర్యటనకు వచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ని ఎంపీపీ మేక లక్ష్మి వీర్రాజు, పలువురు సర్పంచిలు కాంగ్రెస్ లో చేరగా.. వారికి మంత్రి తుమ్మల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. తనకు రాజకీయ భిక్షపెట్టిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు రావడం ఆనందంగా ఉందన్నారు.