సేవా కేంద్రాలను పక్కాగా నిర్వహించాలి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రజాపాలన సేవా కేంద్రాలను పక్కాగా నిర్వహించాలని విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేవా కేంద్రాల ద్వారా సేకరించి ప్రజాపాలన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని సూచించారు. సేవా కేంద్రాల ఏర్పాటు, సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదుపై కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన సేవా కేంద్రాలను మండలాలు, మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు జీరో బిల్లులు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. అర్హులైన వారు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు.