అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి జరిపారు. వినాయక్ నగర్ వంద ఫీట్ల రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నా రనే సమాచారంతో మంగళవారం సాయంత్రం తనిఖీలు జరిపారు. ఓ నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాలిపై నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిత్యం రద్దీగా ఉండే ఇలాంటి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడిపిస్తుండడం గమనార్హం.