అక్షరటుడే, కామారెడ్డి: అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న 162 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, కామారెడ్డి డీటీ సివిల్ సప్లయ్స్ అధికారులు పట్టుకున్నారని దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. దేవునిపల్లి సాయి శ్రీనివాస ట్రేడింగ్ మిల్లులో పీడీఎస్ బియ్యంతో ఉన్న డీసీఎం పట్టుకున్నారు. అరవింద్, దరావత్ సురేష్ లను అదుపులోకి తీసుకొని 277 బస్తాల్లో ఉన్న 162 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయ్స్ డీటీ కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.