అక్షరటుడే, బాన్సువాడ: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీలో జరిగిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, కార్డు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహశీల్దార్ వరప్రసాద్, ఖలేఖ్, అసద్, నార్ల సురేష్, ఉదయ్, నగేష్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.