అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్‌ను నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి, వర్ని మండలం జలాల్పూర్ గ్రామ నాయకులు సన్మానించారు. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రవీణ్ యాదవ్, షేక్ ఉస్మాన్, శ్రీను, సాయిలు, ఆనంద్ గౌడ్, అఫ్రోజ్, శంకర్, లక్ష్మణ్, కుర్మ గంగారాం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.