అక్షర టుడే, భీమ్ గల్: పట్టణంలో నిర్వహిస్తున్న ముత్యాల సమాన్వి స్మారక క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంతాపం తెలిపి మౌనం పాటించారు. అనంతరం ప్రెస్ క్లబ్ క్రీకెట్, BHYA టీంలకు జరిగిన మ్యాచ్ లో బోదిరే గల్లి హనుమాన్ టీం విజయం సాధించింది. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ రెహన్ కి అభినందలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింబాద్రి, ప్రధాన కార్యదర్శి జితేందర్, సురేష్, బాబురావు, నవీన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.