అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలో అర్ధరాత్రి తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం రెండురోజుల జైలుశిక్ష విధించింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బస్టాండ్ వెనుక భాగంలో 1వ డిపో దగ్గర సయ్యద్ మొసిన్ అర్ధరాత్రి వరకు పాన్‌షాప్ తెరిచి ఉంచడంతో తనిఖీ చేసి అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం మార్నింగ్ కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.