అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రధాని రాకతో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సంక్షేమం, సురక్షిత పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
బలమైన భారత్ కోసం కృషి..
బలమైన భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని కితాబు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ ఎంతగానో సహకరిస్తున్నారని.. ఒకవిధంగా వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని ఊపిరి పోశారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.