అక్షరటుడే, ఇందూరు: చిన్నారులను ఆదుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంపీ అరవింద్ ధర్మపురి ముందుంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్పల్లిలో వెలసిన కరపత్రం వెనక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ్ముడి హస్తముందని అన్నారు. రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి మళ్లీ ఎంపీగా పోటీ చేయాలనే ఆశతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వారితో ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్నారని, హుందాతనంతో పోటీలో ఉండాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ స్రవంతి రెడ్డి, నాయకులు గద్దె భూమన్న, నారాయణ యాదవ్, పద్మా రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రమోద్ కుమార్, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.