పేకాట స్థావరంపై పోలీసుల దాడి

0

అక్షరటుడే, బోధన్: మండలంలోని కల్దుర్కి గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి జరిపారు. ఓ స్థావరంలో పేకాట అడుతున్నారనే సమాచారంతో బోధన్ రూరల్ ఎస్సై నాగనాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఆరుగురు జుదరులని అరెస్టు చేసి, రూ.9 వేలు నగదు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై నాగనాథ్ కోరారు.