అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 188 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టాల నుంచి వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. 77 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో సుమారు 300 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 12:00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 185, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ మాత్రమే పాజిటివ్ గా ఉండగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ఐటీ, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ ఒక శాతానికి పైగా లాభంతో ఉండగా రిలయన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, దివిస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, టైటాన్ భారీగా నష్టపోతున్న స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.