అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ శివారులోని అర్సపల్లి రైల్వే గేట్ పై ఓ లారీ నిలిచిపోయింది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సరకుల లోడుతో వెళ్తున్న ఓ లారీ ట్రాక్ మధ్యలో నిలిచిపోయింది. దాదాపు అరగంట పాటు అక్కడి నుంచి కదలలేదు. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రైలును సిబ్బంది నిలిపివేశారు. అనంతరం స్థానికులు లారీని ముందుకు తోశారు. దాదాపు గంట పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీ ముందుకు కదిలిన అనంతరం రైలు నిజామాబాద్ స్టేషన్ కు బయలుదేరింది.