అక్షరటుడే, నిజాంసాగర్‌: బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కమ్మరి యాదగిరి ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను సమితి రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్‌ మంగళవారం ధ్రువీకరించారు. యాదగిరిని అభినందించిన వారిలో రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్‌ నేత, చింతల శంకర్‌, రాజయ్య, శ్రవణ్‌కుమార్‌ గౌడ్‌, జిల్లా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి రాజేందర్‌ ఉన్నారు.