అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: కులగణన సర్వేను సభలో ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ కోరారు. ఆయన మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో చర్చకు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అలాగే సమగ్ర కుటుంబ సర్వేను కూడా ప్రవేశపెట్టలేదన్నారు. కేవలం ప్రకటనలతో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. దీంతో మంత్రి శ్రీధర్​ బాబు స్పందిస్తూ కులగణన సర్వేను సభలో ప్రవేశపెడతామని తెలిపారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అంశం కావున.. దీనిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని చెప్పారు.