అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలోని బాలసదనం, భవానీపేటలో ఉన్న ఇండియన్ జిప్సి ట్రస్ట్ చిల్డ్రన్ హోంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, చదువులపై ఆరాతీశారు. అవసరాలతో పాటు చదువుపై శ్రద్ధ పెట్టాలని, బాగా చదువుకోవాలని పిల్లలకు సూచించారు. అనంతరం వంట గది, స్టోర్ రూం తనిఖీ చేశారు.