తెరుచుకున్న మాధవ నగర్ రైల్వే గేట్

0

అక్షరటుడే, నిజామాబాద్: నగర శివారులోని మాధవ్ నగర్ రైల్వే గేట్ ఎట్టకేలకు తెరుచుకుంది. ఆర్వోబీ పనుల కారణంగా నెలన్నర కిందట ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. టెంపరరీ అప్రోచ్ రోడ్డు పూర్తి చేసిన అనంతరం బుధవారం గేటును తెరిచారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఎట్టకేలకు మార్గంలో రాకపోకలు మొదలు కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.