అక్షరటుడే, వెబ్​డెస్క్​: సచివాలయాన్ని పేల్చేస్తానని మూడు రోజులుగా బెదిరింపు కాల్స్​ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లంగర్​హౌస్​కు చెందిన సయ్యద్​ మీర్​ మహ్మద్​ అలీ సచివాయంలోని అర్జీల విభాగానికి ఫోన్​ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నా స్పందించకపోవడంతో బెదిరించినట్లు నిందితుడు చెప్పాడు.