అక్షరటుడే, వెబ్​డెస్క్​: లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగంపై మంగళవారం ధన్యవాద తీర్మానంలో రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. కొద్దిమంది నేతలు పేదలతో ఫొటో సెషన్లు చేస్తారని వ్యాఖ్యానించారు. కానీ పేదలపై చర్చలో మాత్రం పాల్గొనరని విమర్శించారు. తాము కొందరిలా బూటకపు హామీ ఇవ్వలేదని చెప్పారు. ఆదాయపు పన్ను తగ్గించి మధ్య తరగతి ప్రజలను ఆదుకున్నామని పేర్కొన్నారు. ఆయుష్మాన్​ భారత్​ పథకంతో రూ.1.20లక్షల కోట్ల భారం పేదలపై పడకుండా చేశామని వివరించారు. ఇథనాల్​ బ్లెండింగ్​తో పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గుతాయన్నారు. పదేళ్లలో ఒక్క స్కాం జరగలేదని, అవినీతి రహిత పాలన అందించామని స్పష్టం చేశారు.