అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు మరోసారి ఎన్నికయ్యారు. నెల్లూరులో జరిగిన మహాసభల్లో సోమవారం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 మంది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో పాటు 50 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.