అక్షరటుడే, ఇందూరు: స్కూటీ ఇంజన్ లో పిల్లి ఇరుక్కున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిలక్‌గార్డెన్ కాంప్లెక్స్‌లో రోడ్డు పక్కన ఓ వ్యక్తి యాక్టీవాను నిలిపి ఉంచగా.. పిల్లి తల ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడే ఉన్న మొబైల్‌షాప్ టెక్నీషియన్ దినేశ్ అరగంట పాటు శ్రమించి పిల్లి తలను జాగ్రత్తగా బయటకు తీశాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.