అక్షరటుడే, వెబ్‌డెస్క్ : వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా అందజేశారు. కాగా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరనని ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆది నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.