అక్షరటుడే, వెబ్డెస్క్: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. గత నెల 8న వైకుంఠ ద్వార టికెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు న్యాయ విచారణకు ఆదేశించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్డి సత్యనారాయణ విచారణ చేపడుతున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడ, పద్మావతి పార్కుతో పాటు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను కమిషన్ పరిశీలించింది.