అక్షరటుడే, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట దక్కింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు 2023లో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం పిటిషన్‌ను కొట్టేసింది.